టీడీపీ- బీజేపీల మధ్య పొత్తు కటీఫ్ కావడంతో జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ తర్వాత ఎలా వ్యవహరిస్తారనే దానిపై రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. మోదీని ప్రధాని చేయడమే తన లక్ష్యమంటూ చెప్పుకొచ్చిన పవన్‌కళ్యాణ్, పొత్తుల వల్ల ఇరుపార్టీలకు మేలు జరుగుతుందని గతంలో చెప్పుకొచ్చాడు. టీడీపీతో పొత్తు లేకపోతే ఆయన బీజేపీ వైపు మొగ్గు చూపి, తన అభ్యర్థులను రంగంలోకి దించేందుకు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల విజయవాడ సీటు విషయమై పవన్‌కళ్యాణ్‌తో పీవీపీ చాలాసార్లు భేటీ అయ్యారు.ఇండిపెండింట్‌గా పోటీ చేస్తానని, మద్దతు ఇవ్వాలని కోరాడు. పవన్ మాత్రం తన నిర్ణయాన్ని వాయిదా వేసుకుంటూ వచ్చాడు. ఈ నేపథ్యంలో బీజేపీతో జనసేన పొత్తు కుదుర్చుకుని పవన్ తన అభ్యర్థులను రంగంలోకి దించే అవకాశమున్నట్లు ప్రచారం సాగుతోంది. సీమాంధ్రలో టీడీపీ బలంగావున్న ఎనిమిది ఎంపీ నియోజకవర్గాల్లో అభ్యర్థులను సైతం ఖరారు చేసినట్లు వార్తలు వెలువడుతున్నాయి.
శ్రీకాకుళం,
అరకు,
రాజమండ్రి,
అమలాపురం,
విజయవాడ,
మచిలీపట్నం,
ఒంగోలు,
నెల్లూరు
పార్లమెంటు స్థానాల్లో పవన్‌కళ్యాణ్ ఎంపిక చేసిన అభ్యర్థులు బరిలోకి దిగబోతున్నట్లు తెలుస్తోంది.
శ్రీకాకుళం,
అరకు,
రాజమండ్రి,
అమలాపురం,
విజయవాడ,
మచిలీపట్నం,
ఒంగోలు,
నెల్లూరు
పార్లమెంటు స్థానాల్లో పవన్‌కళ్యాణ్ ఎంపిక చేసిన అభ్యర్థులు బరిలోకి దిగబోతున్నట్లు తెలుస్తోంది.
awaiting 4 that . state will see new trend in politics and true difinition of politician and politics
ReplyDeleteJai Jana Sena
ReplyDelete